సన్నాఫ్ ఇండియా టీజర్‌లో ఆచార్య సర్‌ప్రైజ్.. వెరీ ఇంట్రెస్టింగ్!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తరువాత లీడ్ రోల్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకుసన్నాఫ్ ఇండియాఅనే ఆసక్తికర టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో మోహన్ బాబు రఫ్ లుక్‌తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్‌లో మోహన్ బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్‌ను మనకు చూపించే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్.

ఇక ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్రకు సంబంధించిన లక్షణాలను మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసిందని చెప్పాలి.ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

Advertisement

కాగా ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగులు సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాను పూర్తి థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో దర్శకుడు డైమండ్ బాబు తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు ఇట్టే అర్ధం అవుతోంది.

కాగా సన్నాఫ్ ఇండియా చిత్రంలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

విష్ణు మంచు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఇక సన్నాఫ్ ఇండియా టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు