మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదల అయిన వెంటనే మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ ని రీమేక్ చేయాలని భావించాడు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంను పక్కకు పెట్టాడు.
చిరంజీవి బ్రో డాడీ సినిమా ( Bro Daddy )ను రీమేక్ చేయాలనే నిర్ణయం ను ప్రస్తుతానికి పక్కన పెట్టేసిన చిరంజీవి తాజాగా బింబిసార దర్శకుడు వశిష్ఠ( Mallidi Vasishta ) దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడు.ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను రెడీ చేశాడట.జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా .
ఈ సినిమా ను వశిష్ఠ రూపొందిస్తాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.విశ్వంభర( Viswambhara ) అనే టైటిల్ ను చిరంజీవి తో పాటు దర్శకుడు వశిష్ఠ అనుకున్నారట.
కానీ యూనిట్ సభ్యుల్లో కొందరు టైటిల్ విషయంలో పెదవి విరిచారట.దాంతో యూనిట్ సభ్యుల యొక్క అభిప్రాయం ను తెలుసుకోవాలి భావించారు.అంతే కాకుండా ప్రేక్షకుల్లో కూడా కొంత మంది ని ఈ విషయమై ప్రశ్నిస్తున్నారట.విశ్వంబర టైటిల్ గురించి మెగా ఫ్యాన్స్ గ్రూప్ లో చర్చలు జరుపుతున్నారు.
క్యాచీ గా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లుగా బాగుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఒకటి రెండు వారాల్లో చిరంజీవి మరియు వశిష్ఠ కాంబోలో రాబోతున్న సినిమా కి సంబంధించిన టైటిల్ విషయం లో క్లారిటీ కోసం మెగా ఫ్యాన్స్ కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.