చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం.కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతకు ఆయన ఒక నిలువుటద్దం లాంటి వ్యక్తి.
వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గా మారిన వైనం కూడా ఎంతో మందికి ఆదర్శనీయమని చెప్పాలి.కేవలం సినిమాలు మాత్రమే కాదు ప్రజల శ్రేయస్సు కోసం బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లాంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు మెగా స్టార్ చిరంజీవి.
అలాగే రాజకీయాల్లో కూడా తనదైన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ, తాను రాజకీయాలు చేయలేనని గ్రహించిన చిరంజీవి అతి తక్కువ కాలంలోనే మళ్లీ సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసి తమ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.నెంబర్ 150 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి పరవాలేదు అనిపించిన చివరగా రిలీజ్ అయిన ఆచార్య మాత్రం మెగా అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకుల్ని సైతం నిరాశపరిచింది.
అసలు విషయంలోకి వెళితే గడిచిన గతం ఎంతో వైభవం అయినప్పటికీ రానున్న కాలమే గడ్డుకాలంగా కనిపిస్తుంది.ఆచార్య సినిమా ఫలితం రానున్న సినిమాలపై కచ్చితంగా పడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేని నష్టాలను మిగిల్చిన ఆచార్య సినిమా ఇప్పటికీ అందరికీ పీడకలగానే మిగిలింది.
చిరు అంటే మినిమం గ్యారంటీ సినిమా అని నమ్మే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం అనేక అనుమానాలు ఉన్నాయి.ఏదో ఒక రకంగా ఆచార్య డిస్ట్రిబ్యూటర్ లని ఆదుకోవాలని ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక ఈ ఏడాది మరో మూడు సినిమాలతో సందడి చేయున చిరంజీవి ఈ సినిమాల విషయంలో ఏమైనా తప్పక అడుగులు వేస్తున్నాడా మళ్లీ ఆచార్య ఫలితాన్ని చూడబోతున్నాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.అందుకు కారణాలు లేకపోలేదు.
నిజానికి దసరాకు విడుదలవుతున్న బోలాశంకర్ సినిమాపై కొన్ని అనుమానాలు ఉన్నాయి చిరంజీవి అంటే ఆటలు, పాటలు, డాన్స్, కామెడీ ఇలా ఎన్నో ఆశిస్తారు ఆయన అభిమానులు.కానీ గాడ్ ఫాదర్ సినిమా విషయానికొస్తే మలయాళం లో ఎంతో ఘన విజయం సాధించిన లుసిఫర్ సినిమాకి ఇది రీమేక్ విడుదలవుతోంది కేవలం ఫైట్స్ మినహా మిగతావి ఏమి కూడా అభిమానులు ఆశించితే బొక్క బోర్లా పడటం ఖాయం.
ఎందుకంటే ఈ సినిమా చాలా సీరియస్ గా నడుస్తుంది దాంతో ఈ సినిమా విజయవకాశాలు ఎంత మేరకున్నాయనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
ఈ సినిమా తర్వాత భోళాశంకర్, అలాగే బాబీ దర్శకత్వంలో మెగా 154 సినిమా విడుదల కానుంది.ఇద్దరు దర్శకులపై మెగా ఫాన్స్ లోనే కాదు అందరిలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి.ఇప్పటికే వీరిద్దరూ ఫ్లాప్ దర్శకులుగా ముద్ర వేయించుకున్నారు.
దాంతో ఈ ఈ దర్శకులు మెగా హీరోను నడిపించడంలో ఎంత మేరకు సక్సెస్ అవుతారు అనేది అనుమానమే.ఒకవేళ గనుక ఈ సినిమా హిట్ అయితే ఓకే కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఈ ఇద్దరు దర్శకులు పూర్తిగా సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉంది.
అందుకే ఈ దర్శకులపై తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది ఇంత ఒత్తిడిలో సినిమా ఎలా తీస్తారో వేచి చూడాలి.