జగన్‌ను కలవనున్న చిరంజీవి?.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం!

విశాఖపట్నంలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఈ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్యాడర్‌లో ఉత్సాహాన్ని కలిగించాయి.

 Chiranjeevi To Meet Cm Ys Jagan Soon, Ys Jagan Mohan Reddy, Megastar Chiranjeevi-TeluguStop.com

విశాఖపట్నంలోని భీమిలి రోడ్డులో ప్లాట్‌ను కొనుగోలు చేశానని, వైజాగ్ పౌరుడిగా మారడానికి త్వరలో సిద్దమవుతున్నట్లు చిరంజీవి చేసిన ప్రకటన ఏపీ బ్రాండ్‌ను పెంచేలా ఉన్నయంటు వైఎస్సార్‌సీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.అలాగే ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తూ వైఎస్ఆర్‌సి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ట్వీట్ చేయగా, పలువురు ఇతర పార్టీ నాయకులు మెగాస్టార్‌ నిర్ణయాన్ని అభినందించారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Chiranjeevi, Pawan Kalyan, Primenarendra, Ys

వైజాగ్‌ను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలనే YSRC అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్న సమయంలో చీరంజివి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో YSRC నాయకులు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.కొంతమంది నాయకులు ఆయనను వ్యక్తిగతంగా వారికి ఇంటికి పిలిచి అభినందించినట్లు తెలిసింది.మెగాస్టార్ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది.త్వరలో లంచ్ మీటింగ్‌కి చిరంజీవిని ఆహ్వానించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.మెగాస్టార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించడమే కాకుండా భీమిలి రోడ్డులో ఇంటిని నిర్మించుకోవడానికి అవసరమైన మినహాయింపులు, అనుమతులను కూడా ఇస్తాననే ముఖ్యమంత్రి హామి ఇవ్వనున్నారని సమాచారం.

Telugu Andhra Pradesh, Chandrababu, Chiranjeevi, Pawan Kalyan, Primenarendra, Ys

క్రమంగా సీని పెద్దలు అందరిని ఏపీకి ఆహ్వనిచ్చి ఏపీ బ్రాండ్ పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.ఇక చిరంజీవి కూడా జగన్‌ని కలవాలని, సంక్రాంతి రోజున వాల్తేరు వీరయ్య సినిమా చూడాల్సిందిగా ఆహ్వానించాలని ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీ జరిగితే రాజకీయ వర్గాల్లో కీలక పరిణామానికి దారి తీయవచ్చని రాజకీయ .తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానని చిరంజీవి చాలాసార్లు స్పష్టం చేసినప్పటికీ, తన సోదరుడు పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీ ప్రభుత్వంతో హోరాహోరీగా పోరాడుతున్న తరుణంలో జగన్‌ను కలవడం రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.జోడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube