ఆ కార్యక్రమానికి చిరు హాజరు కాకపోవడంకు కారణం అదేనా?

14 వేల సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిత్యావసరాలను సరఫరా చేసిన విషయం తెల్సిందే.ఈ కార్యక్రమంను భారీ ఎత్తున నిర్వహించారు.

సినీ ప్రముఖులు మరియు ఇండస్ట్రీ పెద్దలు హాజరు అవ్వగా చిరంజీవి మాత్రం హాజరు కాలేదు.గత నెలలో సీసీసీ పేరుతో ఇండస్ట్రీ ప్రముఖులు కోట్లు ఖర్చు చేసి నిత్యావసరాలను సరసఫరా చేయించారు.

చిరంజీవి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది.ఇప్పుడు మళ్లీ తలసాని చేస్తున్న కార్యక్రమంకు చిరంజీవి హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.

చిరంజీవి హాజరు కాకపోవడంపై పలువురు పలు రకాలుగా విమర్శలు గుప్పించారు.దాంతో చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.

Advertisement

తలసాని గారు ఈ పని చేయడం చాలా గొప్ప విషయం.ఆయన గొప్ప మనసుతో ఈ పని చేయడంను అభినందిస్తున్నాను.

ఆ కార్యక్రమంలో నేను హాజరు అవ్వాల్సి ఉంది.కాని సమీప బంధువు ఒకరు మృతి చెందడటంతో నేను ఆ కార్యక్రమానికి వెళ్ల లేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి ఈ కార్యక్రమంకు హాజరు అయితే మరింత పబ్లిసిటీ దక్కేది అనేది కొందరి వాదన.ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ లేక పోవడంతో సినీ కార్మికులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.దాంతో తలసాని ఛారిటీ ఆధ్వర్యంలో ఈ నిత్యావసరాలను చేయడం జరిగింది.

ఎంతో మంది ప్రముఖులు కూడా సినీ కార్మికుల కోసం తమవంతు సాయంను చేశారు.చిరంజీవి కోటి విరాళంను అందించిన విషయం తెల్సిందే.

ఏపీ కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే 
Advertisement

తాజా వార్తలు