శక్తి ప్రతాప్ సింగ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ).ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించగా రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రల్లో నటించారు.మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమా మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా తాజాగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నాగబాబు మెగాస్టార్ చిరంజీవి ఇంకా కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి నాగబాబు మాట్లాడుతూ వరుణ్ తేజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈవెంట్‌లో చిరంజీవి ( Chiranjeevi )మాట్లాడుతూ.నేను ఈ మధ్య అమెరికాలో ఉండగా డాడీ మీతో మాట్లాడాలి’ అని వరుణ్ నుంచి మెసేజ్ వచ్చింది.తర్వాత కాల్ చేసి మా మూవీ ఫంక్షన్ జరుగుతుంది.
మీరు గెస్టుగా రావాలని అడిగాడు.ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మీద తీసిన ఇలాంటి సినిమాకి మీరు వస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది అని అడిగాడు అని తెలిపారు చిరు.
వరుణ్ ఆ మాట చెప్పగానే ఇది నాకు వచ్చిన గొప్ప అవకాశంగా భావించాను. ఒక సైనికుడి గురించి పది మందికి తెలిసేలా చేయడానికి నన్ను రమ్మన్నాడు.
ఇలాంటి రియల్ హీరోల మీద తీసే సినిమాలను ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

అందుకే ఈ ఈవెంట్‌కి వచ్చాను.ఈ ఫంక్షన్‌కి రావడం నాకు గర్వంగా ఉంది అన్నారు.అలా పరిశ్రమకి వచ్చినప్పటి నుంచీ వరుణ్ నన్ను ఫాలో అవ్వట్లేదు.
మా కుటుంబంలో ఏ హీరోకి రాని అవకాశాలు, డిఫరెంట్ రోల్స్ వరుణ్‌కు వచ్చాయి.ప్రతిదీ తను చాలా పద్దతిగా చేసుకుంటూ వచ్చాడు.
అందులో భాగంగానే లావణ్య( Lavanya Tripathi )ను పెళ్లి చేసుకున్నాడు.తను చేసిన 13 సినిమాలు చాలా డిఫరెంట్ మూవీస్ అని పేర్కొన్నారు.







