తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం( Mani Ratnam ) కి ఉన్న క్రేజ్ మరే డైరెక్టర్ కి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఆయనతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న అందరూ హీరోలు పోటీపడేవారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు కూడా ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి.ఇక రీసెంట్ గా ఆయన చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమా తమిళంలో సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

ఇక ఇదిలా ఉంటే మణిరత్నం డైరెక్టర్ గా ప్రకాష్ రాజ్, మోహన్ లాల్( Prakash Raj, Mohanlal ) లను పెట్టి చేసిన ‘ఇద్దరు ‘ సినిమా( Iddaru movie ) సూపర్ డూపర్ సక్సెస్ అయింది.అయితే మొదట మోహన్ లాల్ పాత్ర కోసం చిరంజీవిని( Chiranjeevi ) తీసుకుందామని అనుకున్నారట.కానీ అది రియల్ స్టోరీ అవడంతో చిరంజీవి నటించడానికి ఆసక్తి చూపించలేదు.ఎందుకంటే ఏదైనా కొంచెం తేడా జరిగితే ఆ పాత్ర పోషించిన వారి మీద విమర్శలు వస్తాయనే కారణంతో చిరంజీవి ఆ పాత్రలో నటించలేదు.
కానీ ఈ సినిమాలో నటించినందుకు మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమా తెలుగు, మలయాళం లో కూడా డబ్ అయి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక తెలుగులో అయితే ఈ సినిమాని చూడడానికి జనాలు ఎగబడ్డారనే చెప్పాలి… ఇక ప్రకాష్ రాజ్, మోహన్ లాల్ వాళ్ళ పాత్రల్లో జీవించారనే చెప్పాలి…ఇక ఈ సినిమాతో మోహన్ లాల్ ప్రకాష్ రాజ్ లా యాక్టింగ్ లెవెల్స్ ఏ స్థాయి లో ఉంటాయో అందరికీ అర్థం అయింది.ఇక అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ డిఫరెంట్ పాత్రలు రావడమే కాకుండా వాటిలో నటించి మెప్పించారు…ఇక ఇప్పటికీ వాళ్ళు సక్సెస్ ఫుల్ యాక్టర్స్ గా కొనసాగుతున్నారు…
.







