మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తన ఎంటైర్ కెరియర్ లోచేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.ఆయన దాదాపు 40 సంవత్సరాలుగా మెగాస్టార్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడనే చెప్పాలి.
అయితే ఇలాంటి క్రమంలో ప్రస్తుతం యంగ్ జనరేషన్ ని కూడా చిరంజీవి ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక అందులో భాగంగానే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy movie ) అంటే చిరంజీవికి చాలా ఇష్టమట.

ఆ సినిమాలో ఒక సీన్ అయితే చిరంజీవి చాలా సార్లు చూస్తూ ఉంటాడట.అది ఏ సీన్ అంటే హీరోయిన్ కి కొంతమంది సీనియర్స్ వచ్చి రంగు పూసినపుడు హీరో వాళ్ళని కొడుతూ ఎమోషనల్ గా కొన్ని డైలాగ్స్ చెప్తాడు.ఆ సీను అంటే చిరంజీవికి చాలా ఇష్టం అంట.ఆ సీన్ కోసమే ఈ సినిమాను చాలాసార్లు చూసినట్టుగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో ఉండడం కూడా మన అదృష్టం అంటూ చిరంజీవి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇక రీసెంట్ గా వీరిద్దరి మధ్య ఒక ఇంటర్వ్యూ కూడా నడిచింది.ఇక మొత్తనికైతే చిరంజీవి లాంటి స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోని ప్రోత్సహించడం అలాగే ఆయన సినిమాలు చూసి ప్లస్ పాయింట్స్ ఎంటి, మైనస్ పాయింట్స్ ఎంటి అనేది తనకి కలిసిన ప్రతిసారి చెబుతూ ఉంటాడట.దానివల్ల విజయ్ దేవరకొండ కూడా చిరంజీవి చెప్పిన సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నానని విజయ్ దేవరకొండ చెప్పడం విశేషం… మొత్తానికైతే చిరంజీవి ఇటు యంగ్ జనరేషన్ ని, అటు ఓల్డ్ జనరేషన్ రెండిటిని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు.