మెగా స్టార్ చిరంజీవి మోస్ట్ వెయిటెడ్ ఆచార్య టీజర్ విడుదల అయ్యింది.రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ను ఈ సినిమా టీజర్ దక్కించుకుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.
మొదటి నుండి టీజర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కనుక విడుదల అయిన నిమిషాల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా వ్యూస్ ఈ టీజర్ దక్కించుకుంది.
ఇక లైక్స్ విషయంలో కూడా అతి తక్కువ సమయంలోనే లక్ష వరకు వచ్చాయి.ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి టీజర్ ఇతర తెలుగు సినిమా టీజర్ రికార్డులను బ్రేక్ చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తుంది అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది.విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ రాని ఈ సినిమా టీజర్ రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ను దక్కించుకోవడం వల్ల ఖచ్చితంగా సినిమా స్థాయి పెరిగి బిజినెస్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.
చిరంజీవి ఆచార్య టీజర్ లక్షల వ్యూస్ ను దక్కించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు.ఆచార్య టీజర్ రివ్యూ ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు.మెగా అభిమానులకు సోషల్ మీడియా రికార్డులు అనేవి కొట్టిన పిండి.కనుక వకీల్ సాబ్ కు అద్బుతమైన రికార్డులను కట్టబెట్టిన ఘనత వారికి ఉంది.కనుక సినిమా టీజర్ తో మెగా ఫ్యాన్స్ యూట్యూబ్ రికార్డును నమోదు చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా టీజర్ యూట్యూబ్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో కూడా ట్రెండ్ అవుతుంది.
కనుక టీజర్ తో సినిమా రేంజ్ పెరిగి పోయింది.అద్బుతమైన టేకింగ్ తో కొరటాల శివ మరోసారి సినిమా తో ఇండస్ట్రీ కొట్టడం ఖాయం అంటున్నారు.
చిరంజీవి స్థాయి ఏంటో మరోసారి ఇతర హీరోల అభిమానులకు తెలియబోతుందని మెగా ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు.