హనుమాన్ సక్సెస్ కు చిరంజీవి గోల్డెన్ హ్యాండ్ కారణమా.. ఆయన సపోర్ట్ ప్లస్ అయిందా?

పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్స్ట్, ఇతర కారణాల వల్ల ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరుగుతాయి.అయితే చిన్న సినిమాలకు మాత్రం కలెక్షన్లు రావాలంటే ఏదో ఒక మ్యాజిక్ రావాలి.

 Chiranjeevi Golden Hand Is The Reason For Hanuman Success Details, Chiranjeevi,-TeluguStop.com

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా( Hanuman Movie ) విషయంలో మాత్రం అలాంటి మ్యాజిక్ జరగడానికి చిరంజీవి కారణమని చాలామంది ఫీలవుతారనే సంగతి తెలిసిందే.

హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి( Chiranjeevi ) రావడం, ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని చెప్పడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

చిరంజీవి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అని ఆయన రావడం వల్ల ఈ సినిమాకు మేలు జరిగిందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.చిరంజీవి ప్రమోషన్స్ చేయడం వల్ల ఈ సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హనుమాన్ 6 రోజుల కలెక్షన్లు అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.ఆరో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు( Hanuman Collections ) నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.హనుమాన్ మూవీ తేజ సజ్జా,( Teja Sajja ) ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) రేంజ్ ను మరింత పెంచిందని వీళ్లిద్దరికీ నేషనల్ లెవెల్ లో మరింత గుర్తింపు రావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలు దక్కితే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మలకు తిరుగుండదు.

హనుమాన్ మూవీ కలెక్షన్ల విషయంలో ఏ చిన్న సినిమా సాధించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ సినిమా సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి.హనుమాన్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.2024 చిన్న సినిమాలకు మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube