మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.విడుదల తేదీ సమీపిస్తున్నా కూడా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టక పోవడంతో మెగా అభిమానులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు.
మెగాస్టార్ ఇంకా వాల్తేరు వీరన్న షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు.ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో.
గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొంటాడో అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే గాడ్ ఫాదర్ నుండి ఒక పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రోమో కూడా విడుదల చేసి హడావుడి చేశారు.
తీరా చూస్తే నిన్న సాయంత్రం విడుదల కావలసిన పాటను వాయిదా వేస్తూ టెక్నికల్ ఇష్యూస్ అంటూ ట్వీట్ చేశారు.దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఇదే సమయంలో కొందరు మీడియా వర్గాల వారు ఈ సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేశారా.లేదంటే నిజంగానే టెక్నికల్ సమస్య ఉందా అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు.
పలువురు సినిమా పాట విడుదల అయితే పబ్లిసిటీ వస్తుంది కానీ వాయిదా వేస్తే ఎలా పబ్లిసిటీ దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో ఒక పాటను కూడా సరిగా విడుదల చేయలేక పోయారు అంటూ గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ సభ్యులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇలా అయితే సినిమాను సరిగ్గా విడుదల చేస్తారా.అసలు దసరాకు ఈ సినిమా ఉందా లేదా అనే విషయం క్లారిటీ ఇవ్వాలంటూ మెగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంకా పలువురు నటీనటులు నటించారు.ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే.
అక్కడ లూసిఫర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ ఇక్కడ తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో మెగా అభిమానులు ఉన్నారు.మరి ఫలితం ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయించాలి.