నాగార్జున మొదలు పెట్టాడు... చిరంజీవి మాత్రం ఇంకా మేకప్‌ తీయలేదు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.పరిస్థితి చూస్తుంటే నిజంగానే అక్టోబర్ 5 కి గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 Chiranjeevi God Father Movie Promotion Not Started , Chiranjeevi, Flim News, God-TeluguStop.com

ఎందుకంటే విడుదల తేదీకి ఇంకా మూడు వారాల సమయం కూడా లేదు.అయినా కూడా ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ సభ్యులు కానీ.

మెగాస్టార్ చిరంజీవి కానీ చేస్తున్నట్లు కనిపించడం లేదు.నేడు సినిమాకు సంబంధించిన ఒక పాటని విడుదల చేశారు.

అంతకు మించి హడావుడి ఏం చేయట్లేదు.అదే రోజు విడుదల కాబోతున్న నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాకి మాత్రం ఒక రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటికే నాగార్జున మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నాడు.

కానీ ఇప్పటి వరకు చిరంజీవి తన వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు.

ఆ సినిమా కోసం వేసుకున్న మేకప్ తీసేస్తే కానీ గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొనేటట్లు లేడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మెగా కాంపౌండ్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే సోమవారం నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయట.

అంటే సినిమా కోసం రెండు వారాల ప్రమోషన్స్ షెడ్యూల్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.అంత భారీ సినిమాకు కేవలం రెండు వారాల ప్రమోషన్ ఏ మేరకు సరిపోతుంది అంటూ మెగా అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ భారీ ఎత్తున నిర్వహించాలని మొదట భావించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలు గాడ్ ఫాదర్ ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube