ఈ ఏడాది పూర్తి కాబోతుంది.మరి ఏడాది పూర్తి అయ్యేలోపు డార్లింగ్ నుండి మరో సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత మళ్ళీ ప్రభాస్ నుండి మరో సినిమా రావడం అది కూడా ఎట్టకేలకు డార్లింగ్ కు హిట్ ఇవ్వడం ఫ్యాన్స్ కు అమితానందం ఇస్తుంది.పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ”సలార్” నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.కాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో డార్లింగ్ కు సెలెబ్రిటీలు సైతం అభినందనలు తెలుపుతున్నారు.
తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సలార్ సినిమాపై తన రివ్యూ ఇచ్చేసారు.ఈయన సుర్ప్రైజింగ్ గా ఇచ్చిన రివ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

చిరు ట్వీట్ చేస్తూ.డియర్ దేవా.సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది.ముందుగా ప్రభాస్ కు శుభాకాంక్షలు.డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాను నిర్మించిన ప్రపంచానికి కుడోస్ అంటూ ఈ సినిమాపై చిరు తనదైన శైలిలో ప్రశంసలు అందించారు.మెగాస్టార్ రివ్యూతో ప్రభాస్ ఫ్యాన్స్ లో సంతోషం మరింతగా పెరిగింది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.






