మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పటికే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన గాడ్ ఫాదర్ ముందు ముందు మరిన్ని వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ గాడ్ ఫాదర్ సక్సెస్ అందరిదీ అంటూ వ్యాఖ్యానించాడు.
చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కలిసికట్టుగా సినిమా కోసం పని చేశారని దాంతో సినిమా సక్సెస్ అయిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదే చిరంజీవి ఆమధ్య ఆచార్య సినిమా ఫలితం పూర్తిగా దర్శకుడు కొరటాల శివకే చెందింది అన్నట్లుగా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే.
సక్సెస్ వస్తే చిత్ర యూనిట్ సభ్యులందరికీ క్రెడిట్, ఫ్లాప్ అయితే కేవలం దర్శకుడికి మాత్రమేనా అంటూ ఇప్పుడు సినిమా వర్గాల వారు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆచార్య సినిమా ఫ్లాప్ ని చిరంజీవి ఏమాత్రం జీర్ణించుకోలేక పోయాడు.ఆయన దర్శకుడు కొరటాల శివ పై పదే పదే డైరెక్ట్ గా కాకుండా ఏవో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.ఇటీవల కూడా ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి నేనేం కారణం కాదు అన్నట్లుగా దర్శకుడు చెప్పింది తాను చేశాను అంటూ వ్యాఖ్యలను చేశాడు.
చిరంజీవి వంటి గొప్ప స్టార్ హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి స్టార్ హీరో.
అలాంటి హీరో సినిమా ఫ్లాప్ కి కచ్చితంగా హీరో కూడా కారణం అవుతాడు.ఆయన కోసం ఇమేజ్ అనుసారంగా స్క్రిప్టు రెడీ చేయాల్సి ఉంటుంది.
దానిలో హీరో పాత్ర ఉంటుంది కనుక సక్సెస్ అయిన ఫ్లాప్ అయిన హీరో పాత్ర కచ్చితంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.చిరంజీవి మాత్రం ఆచార్య ప్లాప్ కి సంబంధం లేనట్లుగా మాట్లాడుతున్నారు.
గాడ్ ఫాదర్ సినిమాను మాత్రం అందరి కృషి అంటున్నారు.ఇది ఎంత వరకు న్యాయం ఆయనే చెప్పాలి.