సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు చిరంజీవి ( Chiranjeevi )వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర ( Vishwambara ) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇలా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి తాజాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మరోసారి హనుమాన్( Hanuman ) సినిమాపై ప్రశంసలు కురిపించారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ సజ్జ ( Teja Sajja ) హీరోగా నటించిన హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.ఇలా ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇదివరకే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినటువంటి చిరంజీవి మరోసారి హనుమాన్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా మీకు ఏదైనా సినిమాలో చేయాలని ఉండి చేయలేకపోయానని అసంతృప్తి ఉందా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.తేజ సజ్జ 25 సంవత్సరాల క్రితం నాతోపాటు చూడాలని ఉంది అలాగే ఇంద్ర వంటి సినిమాలలో నటించారు.
అలా ఎదుగుతూ వచ్చాడు.నన్ను చూస్తూ ఇన్‌స్పైర్ అయ్యాడు.
ఈ రోజు హనుమాన్ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందాడు.నాకు ఎప్పుడూ హనుమాన్ మీద ఒక సినిమా చేయాలని కోరిక ఉండేది కానీ తేజ సజ్జ చేసిన తర్వాత నేను చాలా సంతృప్తి చెందాను.
నాకు చాలా గర్వంగా ఉంది.తేజ సైతం నా ప్రయాణంలో ఒక భాగమే అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.