టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ఈయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా మిగిలి పోయింది.
దీంతో మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు.ఇంతటి పరాజయం మెగాస్టార్ కెరీర్ లోనే ఎప్పుడు జరగలేదు.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేతిలో ఇంకా నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.అవన్నీ కూడా పట్టాలెక్కి షూటింగ్ శరవేగంగా జరుపు కుంటున్నాయి.ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.
అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కూడా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్.ఈ సినిమా కూడా షూటింగ్ జరుపు కుంటుంది.
ఈ రెండు సినిమాల షూటింగ్ లను ఒకే సమయంలో పూర్తి చేస్తూ చిరు క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు.అలాగే ఈయన లైనప్ లో మరో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.

ఛలో, భీష్మ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల కు కూడా మెగాస్టార్ ఓకే చెప్పాడు.డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారని ఈ సినిమా అఫిషియల్ గా తెలిపారు.రెండు సినిమాల అనుభవంతోనే ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో అందరు గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడని అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాను మెగాస్టార్ పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.ఆచార్య ప్లాప్ తో మెగాస్టార్ ఇక నుండి కథ, కథనాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నాడట.ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ ఈయన సినిమా పక్కన పెట్టినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.
వెంకీ ఇప్పటికే రెండు నెరేషన్స్ రెడీ చేసిన మెగాస్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఈ ప్రాజెక్ట్ పోయినట్టే అని రూమర్స్ వినిపిస్తున్నాయి
.






