మెగా స్టార్ చిరంజీవి ( Chiranjeevi ) బ్యాక్ టు బ్యాక్ గాడ్ ఫాదర్ ( Godfather )మరియు వాల్తేరు వీరయ్య సినిమా ( Waltair Veerayya ) లతో సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.రికార్డు స్థాయి లో బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.
భోళా శంకర్ సినిమా విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అందరి దృష్టి చిరంజీవి తదుపరి చేయబోతున్న సినిమా పై పడింది.మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ ని తెలుగు లో చిరంజీవి రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు.
అందుకు సంబంధించిన కాస్టింగ్ కూడా వార్తలు వచ్చాయి.చిరంజీవి మరియు సిద్దు జొన్నలగడ్డ తండ్రి కొడుకు పాత్ర లో కనిపించబోతున్నారు.

ఇక చిరంజీవికి జోడీగా చాలా సంవత్సరాల తర్వాత త్రిష నటిస్తూ ఉండగా… సిద్దు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇంకా వస్తూనే ఉన్నాయి.కానీ ఇప్పటి వరకు మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.హీరోయిన్స్ మరియు హీరోల విషయంలో ఉన్న స్పష్టత దర్శకుడి విషయం లో లేదు భారీ ఎత్తున అంచనాలు ఉన్న ఈ సినిమా ను మొదట కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఈ రీమేక్ ను ఆయన ఎలా డీల్ చేస్తాడో అనే అనుమానంతో మరో దర్శకుడికి రీమేక్ బాధ్యతలు ఇవ్వాలని ఆలోచన చేశారు అంటూ కూడా ప్రచారం జరిగింది.దర్శకుడి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ఈ రీమేక్ ను చిరంజీవి కూతురు సుస్మిత నిర్మించేందుకు రెడీగా ఉన్న విషయం తెల్సిందే.రీమేక్ పనులు ఎంత వరకు వచ్చాయి అనేది స్పష్టత రావడం లేదు.
ఎప్పుడైతే భోళా శంకర్ విడుదల అవుతుందో అప్పుడు బ్రో డాడీ పనుల్లో కదలిక ఉండే అవకాశాలు ఉన్నాయి.