సాధారణంగా హారర్ సినిమాల్లో స్నానం చేసేటప్పుడు లేదా చేతులు కడుక్కునేటప్పుడు వాటర్ అవుట్‌లెట్స్ నుంచి ఎర్రటి రంగులో నీళ్లు వస్తుంటాయి.ఈ దృశ్యాలను చూసినప్పుడు భయంగా అనిపిస్తుంది.
అదే ఈ దృశ్యాలను నిజజీవితంలో చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే.అయితే తాజాగా జపాన్ ప్రజలకు అంతకుమించిన ఒక భయంకరమైన అనుభూతి కలిగింది.
జపాన్(Japan )లోని నాగో అనే పట్టణంలో ఒకినావా రేవు( Okinawa ) సమీపంలోని నది ఒక్కసారిగా రక్తంలా ఎర్రబడింది.

దీన్ని చూసి ప్రజలు ఏమైందో ఏమో అని చాలా భయపడిపోయారు.మరికొందరు నది అత్యంత విషపూరితంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలు దాని గురించి సోషల్ మీడియాలో కూడా మాట్లాడారు.
చివరికి ఇది ఒక మామూలు కారణం వల్ల జరిగిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ కంపెనీ ఆహారంలో ఉపయోగించే కలరింగ్ డై ఉపయోగిస్తుంది.
అయితే అది ప్రమాదవశాత్తు నదిలోకి లీక్ కాగా దాని రంగు మారింది.

ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం కాదని బీర్ కంపెనీ ఓనర్స్ తెలిపారు.నాగో( Nago ) నగర ప్రజలకు ఇబ్బంది, ఆందోళన కలిగించినందుకు కంపెనీ క్షమాపణలు చెప్పారు.ప్రొపైలిన్ గ్లైకాల్ అని పిలిచే ఈ రసాయనాన్ని ఆహారంలో ఉపయోగించడం సురక్షితమని యూఎస్‌లోని ఆరోగ్య అధికారులు తెలిపారు.
మంగళవారం లీక్ జరిగిందని, ఇది బ్రూవరీ శీతలీకరణ వ్యవస్థలలో ఒకదాని నుంచి వచ్చిందని సమాచారం.ఈ రంగు వర్షపు కాలువల ద్వారా నదిలోకి ప్రవేశించినట్లు జపాన్ మీడియా పేర్కొంది.
ఓరియన్ బ్రూవరీస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, మళ్లీ అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు.







