మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఆతృతగా ఎదురు చూసారు.
అందరి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ కనిపించారు.లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.
చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దగ్గర నుండి రీమేక్ సినిమాలపైనే ఎక్కువ ద్రుష్టి పెడుతున్నాడు.పక్క భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇక్కడ రీమేక్ చేసి హిట్స్ కొట్టాలని అలా సేఫ్ జోన్ లోనే ఉండేందుకు ఆలోచిస్తున్నాడు.
ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మరో రీమేక్ సినిమాలో నటించ బోతున్నారు అని టాక్ వస్తుంది.

చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ అయిన భీష్మ పర్వం సినిమాను రీమేక్ చేయాలని ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు ఇప్పటికే రామ్ చరణ్ ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు టాక్.మమ్ముటి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక చిరు గాడ్ ఫాదర్ రీమేక్ సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి రీమేక్ సినిమాలపై మక్కువ చూపిస్తున్నాడు.
కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం చిరు నుండి కొత్త కథలను కోరుకుంటున్నారు.అందుకే మరో రీమేక్ సినిమా అంటే పెదవి విరుస్తున్నారు.