మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) సినిమా తో తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే.అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
ఆ రీమేక్ హిట్ అయ్యి ఉంటే వెంటనే బ్రో డాడీ సినిమా యొక్క రీమేక్ మొదలు పెట్టే వారు.కానీ ఇప్పుడు రీమేక్ ల జోలీకి వెళ్ల కూడదు అని నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగానే బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠ తో ఒక కొత్త సినిమా ను రూపొందించాలనే ఉద్దేశ్యం తో ఉన్నారు.ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
విదేశాలకు వెళ్ళిన చిరంజీవి ఇండియాకు తిరిగి రావడం తో హడావిడి మొదలు అయింది.
నవంబర్ లో ఏ క్షణం లో అయినా షూటింగ్ ప్రారంభం కావచ్చు అన్నట్లుగా యూనిట్ సభ్యుల నుంచి క్లారిటీ వచ్చింది.దీపావళి వరకు రెండు విషయాల గురించి ఫ్యాన్స్ కు స్పష్టత ఇవ్వబోతున్నట్లుగా దర్శకుడు వశిష్ణ ఇటీవల సన్నిహితుల వద్ద పేర్కొన్నాడు.మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )సినిమా షూటింగ్ ను నవంబర్ లో ఏ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నది దీపావళి సందర్భంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇక ఈ సినిమా కు గాను విశ్వంభర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు అంటున్నారు.
రెండు కూడా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి ని ఇచ్చే వార్తలు.కనుక కచ్చితంగా అభిమానులు మరియు మీడియా సర్కిల్స్ వారు దీపావళి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ విజయాలను సొంతం చేసుకున్న చిరంజీవి కేవలం ఒకే ఒక్క సినిమా తో సత్తా చాటిన వశిష్ఠ( Mallidi Vasishta ) దర్శకత్వం లో సినిమా చేయడం అనేది కచ్చితంగా చాలా పెద్ద విషయం.
కనుక ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారి తీస్తాయి అనేది అందరికి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.