టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే.చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఇతర హీరోలతో ఎంతో సన్నిహితంగా ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అందరి కంటె ఎక్కువగా సన్నిహితంగా ఉండేది మాత్రం హీరో నాగార్జున తోనే అని చెప్పవచ్చు.టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఈ ఇద్దరు హీరోల, తోటి నటులు మాత్రమే కాకుండా పలు వ్యాపారాలలో కూడా భాగస్వాములుగా కొనసాగారు.
ఇద్దరూ ఏ విషయంలో అయినా కూడా ఒకరికి మరికొన్ని సహాయంగా చేదోడువాదుడుగా ఉంటారు.
అదేవిధంగా సినిమా ప్రమోషన్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు అక్కినేని హీరోలకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు.
కేవలం నాగార్జున,చిరంజీవి మధ్యనే కాకుండా ఆ తర్వాత తరం హీరోల మధ్య కూడా మంచి స్నేహ భావం వుంది.ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి, నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఫోటో షేర్ చేసి పోస్ట్ చేసాడు.
ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్ నాగార్జున ఆయురారోగ్యాలతో సంతోషంగా విజయవంతంగా కొనసాగాలని అనుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా షేర్ చేశారు.

అందులో మెగాస్టార్ చిరంజీవి ఒక చైర్ పై కూర్చొని ఉండగా నాగర్జున చిరు భుజాలపై చేయి వేసి చిరునవ్వుతో స్టిల్ అయితే ఇచ్చాడు.ఇక ఆ ఫోటో నిమిషంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే నాగార్జున చిరంజీవి కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
కానీ ఒక్కసారి కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేసింది లేదు.ఇప్పటికే కొన్నిసార్లు కలిసి సినిమా చేయాలి అని ప్రయత్నం చేసినప్పటికీ అది వర్క్ అవుట్ కాలేదు.







