టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున మంచి స్నేహితులు.వీరిద్దరూ అనేక సందర్భాల్లో స్టేజ్ షేర్ చేసుకున్నారు.
అంతే కాకుండా ఇద్దరు కలిసి పలు బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసిన విషయం తెలిసిందే.ఇద్దరు హీరోలు కూడా చాలా కూల్ గా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉన్నట్లుగా మాట్లాడుతూ ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ అభిమానించుకుంటూ అందరి ముందు ప్రశంసలు దప్పించుకున్నారు.
గతంలో వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద కొన్నిసార్లు పోటీపడ్డారు, కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డ దాఖలాలు లేవు.అందుకే మెగా అభిమానులు మరియు అక్కినేని అభిమానుల మధ్య ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వార్ అనేది కనిపించలేదు.
కానీ వచ్చే దసరా సందర్భంగా ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇద్దరి సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.అలాగే నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఒక్క రోజు లేదా రెండు రోజులు తేడాతో విడుదలైన బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం చేస్తున్నారు.రెండు సినిమాల విడుదల విషయంలో ఈ ఇద్దరు హీరోలు చర్చించుకుని ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ఇద్దరు హీరోల యొక్క బాక్సాఫీస్ వార్ మొదట ఫ్రెండ్లీగా ఉంటుందని భావించారు, కానీ అది ముందు ముందు సీరియస్గా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







