చిరంజీవి సినిమా షూటింగ్ మొదలెట్టిన కొరటాల

సైరాతో సూపర్ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి తరువాత సినిమాని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఇప్పటికే అఫీషియల్ లో ఓపెనింగ్ జరుపుకున్న ఇప్పటి వరకు కాస్టింగ్ సెలక్షన్ వలన సెట్స్ పైకి వెళ్ళలేదు.

వరుస హిట్స్ తో జోష్ మీద ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీని మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా షూటింగ్ దర్శకుడు కొరటాల గురువారం మొదలుపెట్టాడు.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన కాస్టింగ్ ని చిత్ర యూనిట్ ఇంకా ఫైనల్ చేయకున్న తాజాగా సినిమాకి సంబందించిన టెక్నికల్ టీం ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా ప్రకటించింది.చాలా కాలం తర్వాత మణిశర్మ మరోసారి చిరంజీవితో కలిసి పని చేస్తున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాం లోకి వచ్చిన మణిశర్మని చిరంజీవి ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇక వరుసగా నలుగు సినిమాలు కలిసి చేసిన కొరటాల-దేవిశ్రీ కాంబినేషన్ కి ఈ సినిమాతో బ్రేక్ పడింది.

Advertisement

ఇక దీని కోసం స్టార్ కెమెరామెన్ తిరు పని చేస్తున్నాడు.అలాగే ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పని చేస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ మొదలెట్టిన కొరటాలతో త్వరలో చిరంజీవి సెట్స్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు