కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఆచార్య.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది.సామాజిక అంశాలతో కమర్షియల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన చిరంజీవి లుక్స్ కొన్ని సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యి వైరల్ అయ్యాయి.
దీంతో ఇందులో చిరంజీవి కార్మిక నాయకుడుగా కనిపిస్తాడనే మాట బలంగా వినిపిస్తుంది.దేవాదాయ భూములపై పోరాటం చేసే వ్యక్తిగా హీరో కనిపించబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పై చాలా రోజులుగా చర్చ నడుస్తుంది.
నేరుగా ఫస్ట్ లుక్ తో సినిమా టైటిల్, చిరంజీవి లుక్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని కొరటాల శివ భావించాడు.
అయితే చిరంజీవి లుక్స్ లీక్ కావడం, టైటిల్ తో చిరంజీవి నేరుగా పిట్టకథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నోరుజారి చెప్పేయడంతో సినిమా ఫస్ట్ లుక్ మీద ఒక అంచనాకి వచ్చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ముందుగా ఉగాదికి ఫస్ట్ లుక్ ఇద్దామని నిర్ణయించుకున్న కొరటాల ఆలోచన మార్చుకొని హోలీ రోజునే ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఫోటోలు లీక్ అయిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.టాప్ 3 ట్రెండింగ్ లో దూసుకుపోయింది.అలాగే చిరంజీవి ఫస్ట్ లుక్ కి కూడా ఆ స్థాయిలో ట్రెండ్ కావడం పక్కా అని భావిస్తున్నారు.మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.