ప్రతి వ్యక్తి జీవితంలో చిన్నతనంలో ఎన్నో మధుర స్మృతులు( Sweet Memories ) ఉంటూనే ఉంటాయి.కొన్ని సార్లు అవి తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తినడం కూడా మనం జీవితంలో మరచిపోలేము.
అలంటి ఒక సంఘటన చిరంజీవి( Chiranjeevi ) ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో షేర్ చేసుకున్నారు.అయన చెప్పిన సంఘటన చిరు మాటల్లోనే… తనకు అప్పుడు సరిగ్గా 11 లేదా 12 ఏళ్ళు ఉంటాయి.
ఆ టైం లో ఆరవ తరగతి చదువుతున్నాను నెల్లూరు లో.ఆ టైం లో ఏవీఎస్ సంస్థ వారు నిర్మించిన రాము అనే చిత్రం విడుదల అయ్యింది.అన్నగారు ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాను.

దాంతో ఎలాగోలా టికెట్స్ సంపాదించి నెల్లూరు( Nellore ) లో ఒక థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చేసరికి మా నాన్న గారు పోలీస్ కానిస్టేబుల్( Police Constable ) కాబట్టి రద్దీ బాగా పెరగడం తో అక్కడికి వచ్చారు.ఆ తోపులాటలో నలిగిపోయిన నన్ను చుసిన అయన కోపం తో కొబ్బరి మట్ట చీరి కొట్టుకుంటూ నెల్లూరు కనకమహల్ థియేటర్ నుంచి మూన పెట్ వరకు కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు.నాన్నకు ఆవేశం వస్తే ఇక అంతే ఆ రోజు చావగొట్టేసారు.
ఇప్పటికి ఏవిఎం పేరు చెప్పిన రాము సినిమా( Ramu Movie ) పేరు చెప్పిన నాకు ఆ రోజు మా నాన్న కొట్టింది గుర్తుకు వస్తుంది.ఇప్పటికి శివరింగ్ ఆగదు అంటూ చిరంజీవి గారు తన జీవితంలో జరిగిన ఈ ఫన్నీ సంఘటనను షేర్ చేసుకున్నారు.
ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదని, చెప్తే పరువు పోతుంది అని అనుకుంటాన్నని కూడా తెలిపారు చిరంజీవి.

చాల మంది ఫస్ట్ డే ఫస్ట్ షో( First Day First Show ) అంటే చాల ఎక్సయిట్ అవుతూ ఉంటారు కానీ తనకు మాత్రం కనక మహల్ థియేటర్ గుర్తు వస్తుంటుంది అని తెలిపారు చిరు.అయన చిన్నతనంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని, ఆ సినిమా పిచ్చే నన్ను ఈ రోజు మెగా స్టార్( Megastar ) అయ్యేలా చేసిందని కూడా చెప్తూ ఉంటారు.ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా అందరి జీవితాల్లోని ఉంటాయి.
కానీ కొందరు మాత్రమే వాటిని తమ జీవిత పాఠాలుగా మార్చుకోని కెరీర్ లో బాగా వృద్ధిలోకి వస్తారు.







