వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన చింతమనేని... ప్రైవేటు కేసు పెట్టిన మాజీ ఎమ్మెల్యే

వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ పార్టీ నాయకులు, టీడీపీ శ్రేణులు అక్రమ కేసుల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.ఎవరెన్ని ఆరోపణలు చేసినా కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

 Chintamaneni Prabhakar Filed Private Case Aginst Sajjala And Goutam Sawang Details, Chintamaneni Prabhakar ,private Case ,sajjala Ramakrishna Reddy, Former Dgp Goutam Sawang, Eluru Court, Tdp, Ycp, Dendaluru Mla, Ycp Government-TeluguStop.com

దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్ మీద అనేక కేసులు పెట్టింది.ఆ కేసులకు భయపడేదే లేదని చింతమనేని అనేక సార్లు ప్రకటించారు.

అయినా కానీ వైసీపీ ప్రభుత్వం తాను చేసేదే తాను చేస్తోంది.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 2009, 14 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆయన పార్టీ విప్ గా కూడా పని చేశారు.

 Chintamaneni Prabhakar Filed Private Case Aginst Sajjala And Goutam Sawang Details, Chintamaneni Prabhakar ,private Case ,sajjala Ramakrishna Reddy, Former Dgp Goutam Sawang, Eluru Court, Tdp, Ycp, Dendaluru Mla, Ycp Government-వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన చింతమనేని#8230; ప్రైవేటు కేసు పెట్టిన మాజీ ఎమ్మెల్యే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మీద వైసీపీ పార్టీ అనేక ఆరోపణలు చేసింది.2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని మీద అనేక కేసులు బనాయించి వైసీపీ ప్రభుత్వం ఆయన్ను జైలులో పెట్టింది.ప్రస్తుతం చింతమనేని టైమ్ నడుస్తోందని తెలుస్తోంది.

ఆయన వైసీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం మీద ఏలూరు కోర్టులో ప్రైవేట్ కేసు నమోదు చేశారు.

తనను అక్రమంగా జైలులో వేసిన వైసీపీ ప్రభుత్వం మీద ఆయన ఎక్కడ లేని పగతో ఉన్నారు.తన మీద వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఆయన ప్రైవేట్ కేసు పెట్టారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరుల మీద ఆయన ప్రైవేట్ కేసు నమోదు చేశారు.ఇప్పుడు ఈ ప్రైవేట్ కేసు మీద ఏలూరు కోర్టు ఎలా తీర్పు చెబుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం మీద ఏలూరు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో.మరి ఈ సారి చింతమనేని పంతం నెగ్గుతుందో? లేక వైసీపీ మరలా విజయం సాధిస్తుందో అని అంతా ఆతృతగా చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube