చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా ప్రయాణిస్తున్న కారు కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ప్రమాదానికి గురైంది.కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనటంతో భారీ ప్రమాదానికి గురి అయింది.
ఈ క్రమంలో కారులో ఉన్న బెలూన్స్… ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుంచి ఎమ్మెల్యే బయటపడటం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే ఎలిజాతో పాటు వారి కుటుంబ సభ్యులు.
కారులో ఉన్న వాళ్లకి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
దీంతో ప్రమాదం తెలుసుకొని.
చింతలపూడి ఎమ్మెల్యే నీ జడ్పిటిసి పల్నాటి బాబ్జి మరియు వైసీపీ నాయకులు పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా జెడ్పిటిసి పల్నాటి బాబ్జి మాట్లాడుతూ… భగవంతుని ఆశీస్సులు మరియు నియోజకవర్గ ప్రజల దీవెనలు వల్ల ఎమ్మెల్యే గారు సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గారికి భగవంతుడి పట్ల ఉన్న భక్తి మరియు ఆయన చేసిన మంచి పనులు అటువంటి పెను ప్రమాదం నుండి తప్పించాయి.

నిజంగా జరిగిన ఘటన ప్రదేశం మరియు ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల పరిస్థితి చూస్తే అస్సలు పొంతన లేకుండా ఉంది.ఒక్క చిన్న గాయం కూడా ఎమ్మెల్యే గారికి కుటుంబ సభ్యులకి కాకపోవటం నిజంగా అదృష్టమని చెప్పవచ్చు.కనుక నియోజకవర్గ ప్రజలు.
ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జడ్పిటిసి పల్నాటి బాబ్జి తెలియజేశారు.







