తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.మొదటి రోజు విచారణలో భాగంగా సుమారు ఆరు గంటల పాటు రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఎవరెస్ట్ ఇన్ ఫ్రా కంపెనీ లావాదేవీలపై ఆరా తీశారని సమాచారం.మనీ లాండరింగ్ విషయంలోనూ రోహిత్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.అదేవిధంగా రోహిత్ రెడ్డి బ్యాంక్ స్టేట్ మెంట్స్, డాక్యుమెంట్స్ ను పరిశీలించారు.2015 నుంచి ఇప్పటివరకు జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.మరోవైపు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే తనను ఈడీ అధికారులు ఏ కేసులో విచారణకు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు.
ఇలాంటి దర్యాప్తు సంస్థలను ఎక్కడా చూడలేదని విమర్శించారు.







