దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన తాజా చిత్రం ఆదిపురుష్.( Adipurush Movie ) కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని షురూ చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ని నిర్వహించారు.
తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రౌండ్స్ లోని ఆదిపురుష్ 3డి ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి( Chinna Jeeyar Swamy ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం స్వామి వేదికపై ప్రభాస్, ఓంరౌత్ అండ్ టీమ్ కి స్వామీజీ ఆశీస్సులు అందించారు.ప్రతి మనిషి లో రాముడున్నాడు.
అయితే ఆ రాముడి ని బయటికి తేవడం అవసరం.

ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) తన లోని రాముడి ని బయటికి తెచ్చాడు.ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు చేస్తున్న ప్రభాస్ కి ఏడు కొండల పైన ఉన్న వెంకటేశుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని తెలిపారు.తర్వాత అద్భుత ప్రసంగంతో యువతరంలో స్ఫూర్తిని నింపారు.
ఈ సందర్బంగా శ్రీశ్రీ చినజీయార్ మాట్లాడుతూ… శ్రీమాన్ ఓంరౌత్ చరిత్రను సామాన్యులకి చూపించేందుకు ఈ దేశం ప్రపంచంలోని యువతరాని కి చూపించేందుకు ప్రయత్నిస్తున్నందుకు భగవంతు ని ఆశీస్సులు అందుకుంటున్నారు.రాముడు మహాపురుషుడు.
మానవజాతికి ఆదర్శపురుషుడు.ఏ మోడ్రన్ మేన్ చాలా మంది దేవుడిగా కొలుస్తారు కొలవచ్చు.
దేవతలంతా వచ్చి రామా నువ్వు సాక్షాత్తూ నారాయణడవయా.

సీతాదేవి సాక్షాత్తూ లక్ష్మి అయా అని చెబితేనే వారు దేవతలని తెలిసింది.కానీ శ్రీరాముడు మానవ అవతారంలో మనిషి గానే కొనసాగారు.రామానుజుడు తిరుపతి కి వచ్చి 18 సార్లు అతడి చరిత్ర ను తెలుసుకున్నాడు.
పుస్తకాలు రాసారు.శ్రీరాముని పై చాలా సినిమాలు వచ్చాయి.
టీవీల్లో సీరియల్స్ కూడా వచ్చాయి.కానీ ఆ తరం దాటింది.
ఇప్పటి తరానికి మళ్లీ రాముడు కావాలి.ఈతరానికి సంబంధించిన టెక్నాలజీ తో రాముడు కావాలి.
అందుకు అనుగుణంగా విజువల్ టెక్నాలజీ తో శ్రీరాముడి ని చూపిస్తున్నారు అని తెలిపారు చిన్న జీయర్ స్వామి.







