ప్రైవేట్ పార్ట్ పిక్స్ తో ఇన్స్టా గ్రామ్ లో గోలా.. సింగర్ చిన్మయి రచ్చ!

టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలియని వారే లేరని చెప్పాలి.తన గొంతుతో చాలా పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.

 Chinmayi Fires On Instagram About Blocking Her Dm Replies Details, Chinmayi Sri-TeluguStop.com

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ముక్కుసూటి మనిషిగా నిలిచింది.

సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఎక్కువగా సమాజంలో జరిగే వ్యతిరేకత కు బాగా స్పందిస్తుంది.

సమాజంలో జరిగే అన్యాయాల గురించి, మహిళలపై, అమ్మాయిలపై జరిగే దాడుల గురించి బాగా స్పందిస్తుంది.నిజానికి ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రతి ఒక్కరి బాధలను తెలుసుకొని వాటికి స్పందిస్తుంది.ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు తనకు తమ బాధలు గురించి చెబుతూ తమపై ఉన్న భారాన్ని తగ్గించుకున్నారు.

అప్పుడప్పుడు తన అభిమానులతో బాగా ముచ్చట్లు పెడుతుంది.అందులో చాలా మంది కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాల గురించి, హెల్త్ టిప్స్ ల గురించి అడిగి సలహాలు తెలుసుకుంటారు.

హెల్త్ విషయంలో, బ్యూటీ విషయంలో కూడా నిత్యం ఏదో ఒక టిప్ చెబుతూనే ఉంటుంది చిన్మయి.నిజానికి చిన్మయి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి అండగా ఉందనే చెప్పవచ్చు.

ఇక కొందరు మాత్రం ఈమెను బాగా ట్రోల్స్ చేస్తారు.

చాలా వరకు ఆమె ను టార్గెట్ చేసి ఆమెకు ప్రైవేట్ పార్ట్ ల ఫోటో లను కూడా పంపిస్తూ ఉంటారు.అయినా కూడా చిన్మయి అలా టార్గెట్ చేసేవారి గురించి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేది.తిరిగి వారికి తన స్టైల్లో సమాధానమిస్తూ వారిని ముఖం చాటేసుకునేలా చేస్తుంది.

తనకు ఎవరైనా బూతు మాటలతో కామెంట్లు చేస్తే మాత్రం ఆ మాట తిరిగి వాళ్ళకే తగిలేలా చేస్తుంది.

ఇక ఈమె సోషల్ మీడియాని ఎక్కువగా జరిగే అన్యాయాలపై వాదించడానికి, వాటి సలహాలు ఇవ్వడానికి కోసమే ఎక్కువగా ఉపయోగిస్తుంది.

తక్కువ సందర్భాల్లో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఇన్ స్టా గ్రామ్ పై ఫైర్ అయ్యింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

నిజానికి చిన్మయి ని టార్గెట్ చేసిన వాళ్లు ప్రైవేట్ పార్ట్ పిక్స్ బాగా షేర్ చేస్తూ ఉంటారు.అంతేకాకుండా తమ మాటలతో ఆమెను వేధిస్తూ ఉంటారు.దీంతో వాటికి తగ్గట్టు కామెంట్లు పెడుతూ ఉంటుంది.

తనకు డైరెక్ట్ మెసేజ్ లు చేసే వారికి కూడా రిప్లై ఇస్తూ ఉంటుంది.కానీ కొన్ని రోజుల నుండి ఈమె రిప్లై లు ఇవ్వలేకపోతోంది అని తెలిసింది.

ఇన్ స్టా గ్రామ్ తన ఖాతాను బ్లాక్ చేసింది అని.కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా తాను పోరాడుతానని తెలిపింది.ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారానే పంచుకుంది.తనకు అసభ్యకరమైన ఫోటోలు పంపించే వ్యక్తుల ఖాతాలు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నాయని.తన ఖాతా మాత్రం రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేశారు అని ఫైర్ అయ్యింది.దీంతో చిన్మయిని ఇలా చేయడంతో నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ పై బాగా ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube