త్వరలో జరగబోతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ లు తలపడనున్నాయి.ఏపీలో బిజెపి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ అధికారపార్టీ వైసిపి కే విజయం దక్కుతుందని అందరికీ తెలుసు.
పెద్దగా బలం బలగం లేకపోయినా, బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహ లాడుతోంది.అయినా ఈ ఎన్నికలను అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామం , మండలాల వారీగా పార్టీ ఇన్చార్జి లను నియమిస్తోంది.అలాగే మంత్రులకు ఇక్కడ బాధ్యతలు అప్పగించారు.
కీలకమైన నాయకులంతా ఈ నియోజకవర్గంలోని మకాం వేసి, వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి కి భారీగా మెజార్టీ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.మంత్రిగా ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుతో గౌతంరెడ్డి చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
వివాదరహితుడిగా మంచి వ్యక్తిగా అన్ని పార్టీల నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.గౌతమ్ రెడ్డి పై నియోజకవర్గంలోనూ సానుభూతి ఉంది.
అయినా ఇక్కడ వైసీపీ టెన్షన్ పడడానికి కారణం మెజార్టీ గురించే.ఎంత ఎక్కువ మెజారిటీ సాధిస్తే ప్రభుత్వ పాలన అంత గొప్పగా ఉంది అని చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఇప్పుడు ఇంతమందిని ఇన్చార్జిలుగా నియమించి భారీ మెజార్టీ సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నెల పదో తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఇన్చార్జీలు రంగంలోకి దిగి గ్రామాలు మండలాల వారీగా ప్రజలందరినీ కలుస్తూ, వైసీపీ అభ్యర్థి కి భారీగా ఓట్లు పడే విధంగా ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి.

జగన్ సైతం ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.అయితే ఇక్కడ టీడీపీ, జనసేన లు తమ అభ్యర్థులను పోటీకి పెట్టడం లేదు కానీ, ఆ రెండు పార్టీలు ఓటు బ్యాంకు ఎటువైపు డైవర్ట్ అవుతుందనేది ఆ రెండు పార్టీల నేతలు అంచనా వేయలేకపోతున్నారు.కాకపోతే వైసిపి కే ఇక్కడ విజయావకాశాలు ఉన్నా సరే మెజార్టీ విషయంలోనే ఆ పార్టీ హైరానా పడుతోంది.







