భారత సైట్స్ కొనుగోళ్ల మీద దృష్టి సారించిన చైనా ఎందుకో తెలుసా?

ఆసియా ఖండంలో తన ఆధిపత్యాన్ని చూపించడం కోసం ప్రపంచ దేశాలు మద్దతు ఎక్కువగా ఉన్న భారతను దెబ్బతీయడానికి చైనా పాంగ్వాన్ లేక్ వద్ద తిష్ట వేసింది.

భారత్ ఎవరూ ఊహించని విధంగా చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడంతో షాక్ తిన్న చైనా అప్పటినుండి భారతను బెదిరించే కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

కానీ వీటిని పట్టించుకోని భారత ప్రభుత్వం చైనాతో ఎడ్డెమంటే తెడ్డెం అంటూ ముందుకు వెళ్తుంది.దీనితో చైనా భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం అటు నేపాల్ పాకిస్తాన్ తో డ్రామాలు ఆడుతూ ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపే మీడియా,సోషల్ మీడియా రంగాలలోకి ప్రవేశించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది.

తాజాగా అందులో భాగంగానే జమ్మూకాశ్మీర్ లోని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెబ్ సైట్ ని కొనుగోలు చేసింది.ఈ సైట్ ద్వారా భారతపై విష ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇలా చైనా దేశంలోని పలు ప్రముఖ సైట్స్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు విశ్లేషకులు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.మరి ప్రభుత్వం వేగంగా స్పందించి ఇలాంటి వాటి పై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు