పిజ్జా, బర్గర్, చికెన్, పిష్ అంటే ఇష్టపడని నాజ్ వెజిటేరియన్స్ ఉండరు.నాన్ వెజిటేరియన్స్ వీటిని చాలా ఇష్టంగా తింటారు.
రోజూ చికెన్ తినకుండా ఉండలేనివారు కూడా చాలామంది ఉంటారు.అంతగా కొంతమంది చికెన్ ను బాగా ఇష్టపడతారు.
ఇక యువతీ, యువకులు ఫాస్ట్‌ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతున్నారు.చిన్నారుల నుంచి యువకుల వరకు పిజ్జా, బర్గర్లు తింటూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఏఐ పిజ్జా, బర్గర్, చికెన్, పిష్ కూడా రాబోతుంది.బ్రిటన్ కు చెందిన ససీర్ గ్రిల్స్( Seergrills ) అనే స్టార్టప్ ఏఐ ఆధారిత గ్రిల్ పర్పెక్టాను విడుదల చేసింది.

మనకు ఏం కావాలో చెబితే మూడు నిమిషాల్లోనే వసందైన విందును ఆఫర్ చేస్తుంది.దీనిని ఆస్టన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యుుయేట్ సూరజ్ సుదేరాతో( Suraj Sudera ) కలిసి సీర్ గ్రిలస్ ఫౌండర్ తయారుచేశారు.ఇది పర్పాక్టా డ్యుయల్ వర్టికల్ ఇన్‌ఫ్రా రెడ్ బర్నర్స్‌ను కలిగి ఉంటుంది.ఏఐ అల్గారిథమ్స్, స్టార్ట్ సెన్సార్ల కాంబినేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుందని తయారు చేసిన కంపెనీ తన వెబ్ సైట్ లో పొందుపర్చింది.కేవలం 1.30 నిమిషాల్లో ఈ టెక్నాలీ ద్వారా బర్గర్ సిద్దమవుతుంది.

ఇక 2.30 నిమిషాల్లో చికెన్, 2 నిమిషాల్లో పిష్ ను తయారుచేస్తుంది.ఇక బర్గర్, పిజ్జాను కేవలం నిమిషంలోనే రెడీ చేస్తుంది.దీని ధరను రూ.2.9 లక్షలుగా నిర్ణయించారు.ఇటీవల అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరించింది.టెక్, ఈ కామర్స్ రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది.ఇక చాట్ జీపీటీతో ( ChatGPT: )అనేక నూతన మార్పులు వస్తున్నాయి.ఏ విషయాన్ని అయినా సులువుగా తెలుసుకునే వెసులుబాటు వచ్చింది.
ఇప్పుడు ఫుడ్ రంగంలోకి కూడా ఏఐ అడుగుపెట్టడంతో రానున్న రోజుల్లో భారీ మార్పులు రానున్నాయని అర్థమవుతంది.







