ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కొరఢా దెబ్బలు తిన్నారు.అవును మీరు విన్నది నిజమే.
ఓ రాష్ట్రానికి సీఎం అయి ఉండి.ఎలా కొరఢా దెబ్బలు తిన్నాడని ఆశ్చర్యపోతున్నారా? అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని ఎవరు కొట్టాడనే ప్రశ్న మీ మదిని మెదిలేస్తుందా? అయితే కంగారు పడకండి. ఛత్తీస్‌గఢ్ ఆచార సంప్రదాయాల్లో భాగంగా ఓ వ్యక్తి చేతిలో సీఎం భూపేశ్ భగేల్ కొరఢా దెబ్బలు తిన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటాయి.అయితే మంగళవారం ఉదయం దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామాన్ని సీఎం భూపేశ్ భగేల్ సందర్శించారు.
ఆ గ్రామంలో గోవర్ధన్ పూజ నిర్వహించారు.ఆలయాన్ని దర్శించుకున్న సీఎం.
గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి ఆటంకాలు రావొద్దని అమ్మవారిని ప్రార్థించారు.
ప్రార్థన ముగిసిన తర్వాత ఆలయంలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ ఆలయంలో భక్తులను కొరఢాతో కొడతారు.
చెడు సమస్యలు తొలగిపోయి, శుభం కలగాలని ఇక్కడి ప్రజల నమ్మకం.అందుకే భక్తులు కొరఢాతో కొట్టించుకుంటారు.
ఈ క్రమంలో సీఎం భూపేశ్ భగేల్ కూడా కొరఢా దెబ్బలు తిన్నారు.ఈ ఆలయంలో పూజలో భాగంగా కొరఢా దెబ్బలు తినడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.
ప్రతిఏటా ఈ ఆచారాన్ని సీఎం భూపేశ్ భగేల్ పాటిస్తుంటారు.
సీఎం భూపేశ్ భగేల్ కొరఢా దెబ్బలు తిన్న వీడియోను ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.17 సెనక్ల నిడివి ఉన్న ఈ వీడియోకి ఇప్పటివరకు 16కే వ్యూవ్స్ వచ్చాయి.261 మంది రిట్విట్ చేయగా.1,632 లైకులు వచ్చాయి.కాగా ఈ వీడియోకు నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
దెబ్బ బాగా గట్టిగా తగిలిందా? అని కొందరు.దీపావళి శుభాకాంక్షలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.