తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేవెళ్లలో నిర్వహించనున్న సభ వాయిదా పడింది.ముందుగా చేవెళ్ల సభ ఈనెల 18వ తేదీన జరగాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ఈ మేరకు చేవెళ్ల భారీ బహిరంగ సభను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.సమయం తక్కువగా ఉందన్న పార్టీ శ్రేణుల అభిప్రాయంతో ఏకీభవించిన నాయకత్వం ఈనెల 24 కు సభను నిర్వహించాలని ప్రకటించిందని సమాచారం.
కాగా ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.అనంతరం సభా వేదికపై నుంచి ఎస్సీ డిక్లరేషన్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించనుందన్న సంగతి తెలిసిందే.