అడవిలో జీవించే జంతువులలో అతి సాధారణ జంతువుల తో పాటు అతి క్రూర జంతువులూ గురించి మనందరికీ తెలిసిందే.సింహాలు, పులులు, చిరుత పులులు అత్యంత క్రూరమైన, ప్రమాదకరమైన జంతువులయితే మిగతావి చాలా సాధారణంగా మైనవి.
కానీ అడవిలో ఉన్న జంతువులే అయినా క్రూర జంతువులకు సాధారణ జంతువులే ఆహారంగా బలి అయిపోతుంటాయి.సాధారణ జంతువులను క్రూర జంతువులు రెప్పపాటులో అతి భయాంకరంగా దాడి చేసి తమ ఆకలిని తీర్చుకుంటాయి.
ఎంత అప్రమత్తంగా ఉన్నా అడవిలో క్రూర జంతువుల రూపంలో ఏదో ఒక వైపు నుండి ప్రమాదం పొంచి ఉంటుంది.తాజాగా ఇలాంటి సంఘటనే ఓ అడవిలో జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
వైరల్ వీడియో ప్రకారం.
ఒక జింక చెరువులో నీరు తాగుతూ నిలబడి ఉంటుంది.అయితే అప్పటికే చిరుత జింక పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది.
పొంచి ఉన్న ప్రమాదం గమనించని ఆ జింక తాపీగా నిలబడి అటూ ఇటూ చూస్తూ పరిసరాలను గమనిస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో పొదల మాటున జింక పై వేటాడేందుకు నక్కి ఉన్న చిరుతను చూసి ప్రమాదాన్ని పసిగట్టింది.
అయితే చిరుత ఒక్కసారిగా జింక పై దాడి చేసేందుకు మీదకు వచ్చింది.అప్రమత్తమైన జింక వెంటనే తన కాళ్లకు పని చెప్పి వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను రక్షించుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో చిరుత మాటువేసి జింకను వేటాడిన విధానం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.ఈ భయంకరమైన వీడియోను ఐఏఎస్ అధికారి సాకేత్ బడోలా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.‘ప్రమాదం ఇప్పుడైనా ఎక్కడి నుండైనా రావొచ్చు.అందుకే ఎల్లప్పుడూ అప్రమతంగా ఉండాలి’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.దీంతో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.లైక్ లు కొడుతూ, కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు.అలాగే ఈ వీడియో చూసిన తరువాత గూస్ బంప్స్ వచ్చాయని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.