ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్నికల సందడి అప్పుడే కనిపిస్తోంది.రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఒక్కో నియోజకవర్గంలో నుంచి ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తుండడంతో, ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఈ వ్యవహారాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
ఇదిలా ఉంటే చీరాల అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారబోతోంది.అసలు చీరాల నియోజకవర్గం మొదటి నుంచి వైసీపీకి తలనొప్పిగానే ఉంది.
ఇక్కడ మూడు గ్రూపులు ఉండడంతో ఎవరికి వారు తామే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.అయితే ఈ విషయంలో వైసిపి అధిష్టానం అంత సీరియస్ గా అయితే తీసుకోలేదు.
కానీ ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం మరింత కాక రేపుతోంది.
![Telugu Amanchikrishna, Ap Cm Jagan, Cheerala, Karanam Balaram, Pothula Sunitha-P Telugu Amanchikrishna, Ap Cm Jagan, Cheerala, Karanam Balaram, Pothula Sunitha-P]( https://telugustop.com/wp-content/uploads/2022/12/amanchi-krishna-Mohan-Karanam-Balaram.jpg)
ఇక విషయానికి వస్తే .చీరాల పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమంచి కృష్ణమోహన్ .2009లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.ఆ తరువాత 2014లో ఆయన సొంతంగా నవోదయం పార్టీని పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు.2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.ఇక అప్పటి నుంచి చీరాల వైసీపీ ఇన్చార్జిగా ఆయన కొనసాగుతున్నారు.
అయితే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ పై టిడిపి తరఫున గెలిచిన ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం వైసీపీకి అనుబంధంగా కొనసాగుతుండడంతో , ఆమంచి – కరణం వర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.ఇది చాలదన్నట్లు టిడిపి నుంచి వచ్చిన పోతుల సునీతకు ఎమ్మెల్సీగా జగన్ అవకాశం కల్పించారు.
దీంతో ఆమె కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో చీరాలలో వైసిపి మూడు వర్గాలుగా విడిపోయింది.కరణం బలరాం విషయాన్నికొస్తే.ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి తన కుమారుడు కరణం వెంకటేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ , కరణం వెంకటేష్, పోతుల సునీత మూడు వర్గాలుగా విడిపోవడంతో, ముగ్గురు విడివిడిగానే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
![Telugu Amanchikrishna, Ap Cm Jagan, Cheerala, Karanam Balaram, Pothula Sunitha-P Telugu Amanchikrishna, Ap Cm Jagan, Cheerala, Karanam Balaram, Pothula Sunitha-P](https://telugustop.com/wp-content/uploads/2022/12/Karanam-Balaram-pothula-Sunitha.jpg )
ఈ వ్యవహారాలు వైసీపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారడంతో, నేరుగా జగన్ రంగంలోకి దిగారు.ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా తాజాగా నియమించారు.ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు.
పరుచూరుకు సంబంధించి ఇకపై ఏ విషయం అయినా ఆమంచితో కలిసి పని చేయాలని జగన్ సూచించారు.అక్కడ ఇన్చార్జిగా ఉన్న రామనాథం బాబును పదవి నుంచి తొలగించ వద్దంటూ జగన్ పై నియోజకవర్గ నాయకులు ఒత్తిడి చేసినా, జగన్ మాత్రం ఆమంచిని నియమిస్తున్నట్లు ప్రకటించేశారు.
అయితే ఆమంచి కృష్ణమోహన్ మాత్రం పరుచూరి నుంచి పోటీ చేసేందుకు అక్కడ ఇన్చార్జిగా కొనసాగేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట.తనకు చీరాల నియోజకవర్గంలోనే గట్టి పట్టు ఉందని, అక్కడి నుంచి పోటీ చేస్తానని , అవసరమైతే వైసీపీని వీడేందుకు కూడా వెనకాడనని తన సన్నిహితులు వద్ద చెబుతున్నారట.
మొత్తంగా చూస్తే ముందు ముందు చీరాల నియోజకవర్గం వైసీపీకి తలనొప్పిగా మారబోతున్నట్టే కనిపిస్తోంది.
.