టాలీవుడ్ బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్.బుల్లితెరపైతన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.తన అందాలతో కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.వారిని అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

రష్మీ మొదట్లో వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టింది.ఇక అప్పుడు రష్మీ అంటే ఎవరికి తెలియదు.కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పుడే అందరి దృష్టిలో పడింది.
ఈ షో ఆమె కెరీర్ కు మలుపు తిప్పింది.ఈ షోలో అడుగుపెట్టాకే రష్మీకి ఒక గుర్తింపు అనేది వచ్చింది.
అంతేకాకుండా ఆ షోలో మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ఎంత సందడి చేసిందో చూశాం.ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న జంట పక్షుల్లాగా చేశారు.
జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమైన ఢీ డాన్స్ షోలో కూడా రష్మీ టీం లీడర్ గా పనిచేసింది.అక్కడ కూడా సుధీర్ తో బాగా సందడి చేసింది.
ఇప్పటికీ జబర్దస్త్ లో కొనసాగుతూనే ఉంది.ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా కొనసాగుతుంది.
అక్కడ కూడా యాంకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇక ఏదైనా ఈవెంట్ ఉంటే చాలు ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.తన డాన్స్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తుంది.రష్మీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా కనిపిస్తుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పంపించడమే కాకుండా.సమాజంలో జరిగే విషయాల గురించి కూడా బాగా పట్టించుకుంటుంది.
అంతేకాకుండా జంతువుల పట్ల తాను చూపించే ప్రేమ మాత్రం బాగా ఎమోషనల్ గా కనిపిస్తుంది.ఏదైనా మూగ జీవికి ఏమైనా అయితే వెంటనే రియాక్ట్ అవుతుంది.
కొన్నిసార్లు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.గతంలో ఎన్నో మూగజీవుల స్టోరీలను పంచుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అంత గొప్ప మనసున్న రష్మీ.ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో ఏదో ఒక విషయాన్ని తెలియజేయాలని చేస్తుంది.

అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ అందులో తన అందాలతో అందర్నీ ఆకట్టుకుంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే గత ఏడాది బిగ్ బాస్ 6 సీజన్ ముగిసిన సంగతి తెలిసిందే.అయితే త్వరలో సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అందులో యాంకర్ రష్మీ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో వెంటనే రష్మీ స్పందించింది.తను బిగ్ బాస్ లో అవకాశం అందుకున్నట్టు పుకార్లు ఆపండి అంటూ.
తను బిగ్బాస్ లో ఎటువంటి భాగం కాదు అన్నట్టు తెలిపింది.ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది.