సాయిరెడ్డి దూకుడుకు వైసీపీలో చెక్‌.. కీల‌క నేత పావులు...!

అధికార పార్టీ వైసీపీలో కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కామ‌న్‌గా మారిపోయింది.అయితే.

 Check Out Saireddy's Aggression In Ycp .. Key Weave Pieces,ap,ap Politics,ap Pol-TeluguStop.com

ఇప్పుడు ఇది.రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీయ‌డం.వైసీపీ సీనియ‌ర్లు కూడా ఈ చ‌ర్చ నిజ‌మేన‌ని చెప్ప‌డం.మారుతున్న ప‌రిణామాలు కూడా దీనికి ద‌న్నుగా మార‌డంతో అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై స‌ర్వత్రా ఆస‌క్తిగా మారింది.

వైసీపీలో జ‌గ‌న్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రిని క‌దిలించినా.విజ‌య‌సాయి రెడ్డి పేరే చెబుతారు.పార్టీలో ఎలాంటి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.ఎలాంటి నాయ‌కుడికి ప‌ద‌వి ఇవ్వాల‌న్నా.

ఎక్క‌డ పార్టీ అడుగులు ప‌డాల‌న్నా కూడా అన్నీ సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయి.నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా జ‌రుగుతున్నాయి.

Telugu Ap, Jagan, War, Sai Reddy, Target, Ysrcp-Telugu Political News

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన నాయ‌కుల్లో సాయిరెడ్డి కీల‌క రోల్ పోషించారు.ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ను తీసుకువ‌చ్చి.పార్టీ గెలుపు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డంలోను, ఆ త‌ర్వాత పార్టీ ని ముందుకు న‌డిపించ‌డంలోను.జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్రలో ఉంటే.అన్నీ తానై నాయ‌కుల‌ను న‌డిపించ‌డంలోను.టికెట్ల విష‌యంలోనూ కూడా సాయిరెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను ఆద‌రించారు.

పార్ల‌మెంటు స్థాయిలో మంచి ప‌ద‌వి కూడా ఇచ్చారు.

అయితే.

కొన్నాళ్లుగా సాయిరెడ్డి కేంద్రంగా అనేక అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెడితే.

జ‌గ‌న్ స్వ‌యంగా ఇంటిలిజెన్స్ ద్వారా తెప్పించుకున్న నివేదిక‌ల్లోనూ సాయిరెడ్డి దూకుడు స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.ఈ క్ర‌మంలో సాయిరెడ్డికి ప్రాధాన్యం త‌గ్గుతూ వ‌స్తోంది.

అదేస‌మయంలో పార్టీలో జ‌గ‌న్‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దూకుడు పెరిగింది.ఇక్క‌డ ఈయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న ప‌రిణామం అవినీతి లేక‌పోవ‌డం.

అయితే ఆధిప‌త్యం మాత్రం ఎక్కువ‌గా ఉంది.ఈ క్ర‌మంలో అవినీతి ఆరోప‌ణ‌లు లేని స‌జ్జ‌ల అయితే.

బెట‌ర్ అని జ‌గ‌న్ కూడా భావిస్తున్న‌ట్టు పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు./br>

Telugu Ap, Jagan, War, Sai Reddy, Target, Ysrcp-Telugu Political News

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల కాలంలో అన్ని విష‌యాల్లోనూ స‌జ్జ‌ల జోక్యం చేసుకుంటున్నారు.పార్టీ త‌ర‌ఫున ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆయ‌న ముందుంటున్నారు.సీఎం తీసుకునే నిర్ణ‌యాలు తొలుత ఆయ‌న‌కే తెలుస్తుండ‌డం సాయిరెడ్డి క‌న్నా ఆయ‌న దూకుడుగా నాయ‌కుల‌తో క‌లిసి పోవ‌డం, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కూడా షార్ప్ షూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం వంటి ప‌రిణామాలు.

వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.అయితే.ఢిల్లీలో ప‌ట్టున్న సాయిరెడ్డిని ఢీకొట్టే రేంజ్ స‌జ్జ‌ల‌కు లేద‌ని అంటున్నారు సీనియ‌ర్లు.ఏదేమైనా.

సాయిరెడ్డి వ‌ర్సెస్ స‌జ్జ‌ల మ‌ధ్య రాజ‌కీయం ఎటు దారితీస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube