ఎట్టకేలకు 'ఛత్రపతి' సినిమా షూట్ పై వచ్చిన క్లారిటీ !

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తూ, ఎన్నో భారీ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు.

బెల్లంకొండ వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

"అల్లుడు శీను" సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించదు.ఈ సినిమా పర్వాలేదు అనిపించినా సూపర్ హిట్ అయితే అవ్వలేదు.

ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం ఫిట్ గా కండలు తిరిగిన బాడీతో తనను తాను రెడీ చేసుకున్నాడు.తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమాహిందీలో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను హిందీలో వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మొదటిసారి హిందీ లో అడుగు పెట్టబోతున్నాడు.అంతేకాదు వివి వినాయక్ కు కూడా ఇదే మొదటి సినిమా.

ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమా ఆగిపోయిందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాను జులై లో సెట్స్ మీదకు తీసుకువెళ్లా బోతున్నారట.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.షూటింగ్ కోసం హైదరాబాద్ శివారులో భారీ విలేజ్ సెట్ రెడీ చేస్తున్నారట.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అందులోనే షూటింగ్ ప్రారంభించా బోతున్నారని సమాచారం.ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మిగతా షెడ్యూల్స్ బెంగళూరు, ముంబై, బాంగ్లాదేశ్ లలో జరపనున్నారట.

Advertisement

తాజా వార్తలు