టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) 11 ఏళ్ల కిందట ఉపాసనను( Upasana ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లయినప్పటి నుంచి మెగా వారసుడిని ఎప్పుడు ఇస్తారు అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రశ్నించారు.
అంతేకాదు వాళ్లు పిల్లలు వద్దనుకుంటున్నారని ఆమధ్య గాసిప్ కూడా క్రియేట్ చేశారు.ఇక వారి గురించి ఎన్ని ఫేక్ వార్తలు వచ్చినా కూడా లో లోపల కుమిలి పోయారు తప్ప ఏ రోజు కూడా బయటకు చెప్పుకోలేదు.
అలా 11 ఏళ్ల ప్రయాణాల్లో వారి జీవితం సాఫీగా సాగినప్పటికీ కూడా బయట జనాల నుంచి పిల్లల విషయంలో ఎన్నో ఒత్తిడిలు ఎదుర్కొన్నారు.అలా ఓపిక గా ఉండగా గత ఏడాది ఉపాసన గర్భం దాల్చింది.
ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి మెగా అభిమానులు సంతోషంలో పొంగిపోయారు.జూనియర్ రామ్ చరణ్ లేదా జూనియర్ ఉపాసన వస్తున్నారు అని మురిసి పోయారు.
అలా 9 నెలలు మెగా ఫ్యామిలీ కూడా తమ వారసుల కోసం ఎదురు చూశారు.అంతేకాకుండా తన ప్రాజెక్టులన్ని పక్కకు పెట్టి భార్యకు సేవలు చేశాడు రామ్ చరణ్.తనకు కావాల్సింది అన్ని దగ్గర తెచ్చి పెట్టాడు.తిరగాలన్న చోటకు తిప్పాడు.కావాలన్న ఫుడ్ తినిపించాడు.అలా 9 నెలలు తనను ప్రేమగా చూసుకోగా జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
పాపకు లలితా సహస్రనామం నుండి తీసుకోబడిన క్లిన్ కారా( klin Kara ) అనే పేరు పెట్టారు.అంతేకాకుండా పాప కోసం స్పెషల్ గా పాపగదిని అందంగా డెకరేషన్ కూడా చేయించారు.అయితే ఈరోజు ఉపాసన పుట్టిన రోజు.అంతేకాదు తమ పాప పుట్టి నెలరోజులు కూడా అయింది.ఈ సందర్భంగా మెగా వారి ఇంట్లో బర్త్డే సంబరాలు జరుగుతున్నాయి.అయితే తాజాగా రామ్ చరణ్ ఒక ఎమోషనల్ వీడియో పంచుకున్నాడు.
అందులో ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తన డెలివరీ, పాప ఉయ్యాల ఫంక్షన్ అన్ని క్లిప్ లు చూపించారు.
అంతేకాకుండా చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కొన్ని విషయాలు కూడా పంచుకున్నారు.ఇక పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఇంకేం చేస్తున్నారు అని ఆ మాటల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నాను అని చరణ్ అన్నాడు.అంతేకాకుండా పాప పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.
ఉపాసన కూడా ఎమోషనల్ గా కొన్ని విషయాలు పంచుకుంది.హాస్పిటల్లో పాప పుట్టిన సమయంలో తీసిన క్లిప్ కూడా పంచుకున్నాడు.
ఉయ్యాల ఫంక్షన్ రోజు పాపని ఎత్తుకొని ఉన్న ఉపాసన ఆనందంలో కంటనీరు తెచ్చుకోవడంతో రామ్ చరణ్ తుడిచినట్లు కనిపించాడు.అంతేకాదు కోయవారితో ప్రత్యేక నాట్యాలు, అమ్మవారి పూజలు చేయించారు.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.ఆ వీడియో చూసిన వారంతా బాగా లైక్స్ కొడుతున్నారు.