రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ మార్చి నెల 20వ తేదీ నుంచి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
గతంలో ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా తీయాలని అనుకున్న సమయంలో ఈ టైటిల్ ను రిజిష్టర్ చేయించగా అదే టైటిల్ తో సినిమా తెరకెక్కించాలని బుచ్చిబాబు( Buchi Babu San ) ఫిక్స్ అయ్యారని భోగట్టా.

అయితే పాన్ ఇండియా సినిమాకు ఇలాంటి టైటిలా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఎక్కువమంది మెగా ఫ్యాన్స్ ఈ టైటిల్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేయడం లేదు.
అయితే టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదనే సంగతి తెలిసిందే.విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.చరణ్ బుచ్చిబాబు ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాకు క్యాస్టింగ్, టెక్నీషియన్స్ విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా మేకర్స్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.మైత్రీ మూవీస్ కూడా ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉంది.
చరణ్( Ram Charan ) గత సినిమాలను మించి ఈ సినిమా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చరణ్ రేంజ్ ను ఈ మూవీ పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.