రోజులు గడిచేకొద్ది తెలంగాణ ఎన్నికలు మరింత రసవత్తరం గా మారుతున్నాయి.అధికార మార్పు తధ్యమని కొన్ని ముందస్తు సర్వేలు ఘోషిస్తుంటే కేసీఆర్ దే అధికారం అంటూ మరికొన్ని సర్వేలు నొక్కి వక్కాణిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం వరకు వచ్చిన ముందస్తూ సర్వేలన్నీ తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీ దేనని అధికార పార్టీ పైన అసంతృప్తి కాంగ్రెస్కు వరంగా మారుతుందని, అంతర్గత పోరును సరిదిద్దుకుంటే కాంగ్రెస్( Congress party ) దే తెలంగాణ అంటూ తేల్చేశాయి .అయితే గత రెండు రోజులుగా వచ్చిన ముందస్తు సర్వేలు అయిన ఇండియా టివి మరియు చాణిక్య సర్వేలు మాత్రం కేసీఆర్ దే తెలంగాణ అంటూ స్పష్టం చేస్తున్నాయి.ఇండియా టీవీ అయితే ఏకంగా 70 సీట్లు సాధించి తెలంగాణలోకి బియారస్ ఏకపక్షం గా అధికారంలోకి వస్తుందని తేల్చయగా చాణక్య సర్వే మాత్రం సీట్ల సంఖ్యను చెప్పకుండా ఓట్ల షేరింగ్ను ప్రకటించింది .

46% బిఆర్ఎస్( BRS party ) కు 32 శాతం కాంగ్రెస్కు, బిజెపి కు 17 శాతం ఇతరులు ఐదు శాతం ఓట్ షేరింగ్ ని పంచుకుంటారని ఈ సర్వే అంచనా వేసింది.అయితే ఈ ముందస్తు సర్వేలలో ఏ సర్వేకు ఏ స్థాయి విశ్వసనీయత ఉందని ఉందన్నది ప్రశ్నార్ధకమే అని చెప్పాలి .తెలంగాణలో ఓటరు నాడి మాత్రం ప్రస్తుతానికి అస్పష్టంగా ఉందనే చెప్పాలి.ముఖ్యంగా సంక్షేమ పథకాలు( Welfare schemes ) అమలు, రైతాంగానికి జరిగిన మేలు, ఆర్థిక అభివృద్ధి వంటివి ప్రాతిపదికగా తీసుకుంటే బారతీయ రాష్ట్ర సమితి కి మంచి మార్కులే పడతాయి.అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వంటివి ప్రాధాన్యంగా తీసుకుంటే కాంగ్రెస్కు అవకాశం లభించవచ్చు.
ప్రస్తుతానికి తెలంగాణ ఓటరు గుంభనం గా ఉన్నట్లుగానే తెలుస్తుంది.అయితే ఇంకా 40 రోజులు సమయం ఉండడంతో పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు అని అంచనాలు ఉన్నాయి.

అయితే ఎక్కడికి అక్కడ వార్ రూమ్ మీటింగులు, అంతర్గత సమావేశాలతో అధికార బారాస పూర్తిస్థాయి వేగాన్ని చూపించడం , ఇతర పార్టీల్లోని ద్వితీయశ్రేణి నాయకులను కూడా పార్టీలోకి ఆకర్షించగలగటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కని వర్గాలను గుర్తించి వారికి కొత్త హామీలు ఇవ్వటం వంటి చర్యలతో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న బారాస మిగిలిన పక్షాలతో పోలిస్తే కొంత ముందు ఉన్నట్లు స్పష్టమవుతుంది.కాంగ్రెస్ బిజెపిలు ఇంకా అభ్యర్థుల లిస్టుల తో కుస్తీ పడుతుంటే కేసీఆర్ మాత్రం( KCR ) భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి దూసుకు వెళ్తుండడం తో రానున్న రోజుల్లో గాలి బారాసకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.