హైదరాబాద్ మెట్రో సేవల వేళలలో మార్పు

హైదరాబాద్ నగర ప్రజల రవాణా సౌకర్యం నిమిత్తం ఎంతో దోహద పడుతున్న మెట్రో సేవలను ప్ర‌యాణికులకు మరింత చేరువగా అందించాలని సీఎం కేసిఆర్ సూచనలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మెట్రో స‌ర్వీసుల వేళ‌ల‌ను అధికారులు పొడిగించారు.ఇక నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు అందుబాటులో ఉండ‌నున్నాయి.

 Change In Hyderabad Metro Service Timings Hyderabad, Metro Service Timings, Cha-TeluguStop.com

ఈ నెల 10వ తేదీ నుంచి ఈ స‌ర్వీసులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు మెట్రో అధికారులు వెల్ల‌డించారు.ప్ర‌స్తుతం చివ‌రి మెట్రో రాత్రి 10:15 గంట‌ల వ‌ర‌కే అందుబాటులో ఉంది.ఈ స‌మ‌యాన్ని 11 గంట‌ల వ‌ర‌కు పొడిగించ‌డంతో ప్ర‌యాణికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సాప్‌ ద్వారా మెట్రో ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ను బుకింగ్‌ చేసుకునే సేవలను ఇటీవ‌లే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ ఇలామెట్రో ప్రయాణికులు మొదట 8341146468 నంబకు వాట్సాప్‌ ద్వారా హాయ్‌ అనే సందేశాన్ని పంపించాలి.దానికి వెంటనే మరో సందేశంతో ఒక లింకు వస్తుంది.

లింకును ఒపెన్‌ చేయగానే (https://hyd.billeasy.in) వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.ఆ త‌ర్వాత‌ ప్రయాణం చేసే మార్గాన్ని చూపిస్తుంది.అందులో ఏ మెట్రో స్టేషన్‌ నుంచి ప్రయాణం ప్రారంభించి, ఎక్కడ దిగుతారో నమోదు చేయాలి.

ఆ తర్వాత టిక్కెట్‌ ఒకరి కోసమా, తిరుగు ప్రయాణమా అని అడుగుతుంది.వీటిని ఎంపిక చేసుకున్న తర్వాత టిక్కెట్‌ కోసం చెల్లించాల్సిన రుసుమును చూపిస్తూ ప్రోసీడ్‌ బటన్‌ బ్లూ కలర్‌ చూపిస్తుంది.

దాన్ని నొక్కగానే పే నౌ బటన్‌ వస్తుంది.అక్కడి నుంచి యుపీఐ, లేదా ఇతర అకౌంట్ల ద్వారా టిక్కెట్‌ కోసం చెల్లింపులు చేయవచ్చు.టిక్కెట్‌ కోసం నిర్ణీత చెల్లింపు చేసిన తర్వాత క్యూర్‌ కోడ్‌తో టికెట్‌ వస్తుంది.దాని మెట్రో స్టేషన్‌లో ఎంట్రీ గేటు వద్ద క్యూఆర్‌ కోడ్‌ రీడర్‌ ముందు చూపితే లోపలి వెళ్లేందుకు అనుమతిస్తుంది.

ఈవిధంగా అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా మెట్రో రైలు టిక్కెట్లను అత్యంత సులభంగా కొనుగోలు చేసి ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube