డైరెక్టర్ పి వాసు ( P.Vasu ) దర్శకత్వంలో రజనీకాంత్ ( Rajanikanth ) హీరోగా నటించిన చిత్రం చంద్రముఖి.( Chandramukhi ) ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఇలా చంద్రముఖి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా విడుదలైనటువంటి 17 సంవత్సరాలకు తిరిగి చంద్రముఖి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే ఈ సినిమాలో రజనీకాంత్ నయనతార జ్యోతిక వంటి వారు నటించడం లేదు రజనీకాంత్ స్థానంలో నటుడు రాఘవ లారెన్స్ ( Raghava Lawrence ) నటించారు.ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ పి వాసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలు తెలియడమే కాకుండా చంద్రముఖి గురించి కూడా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.చంద్రముఖి 2 తర్వాత చంద్రముఖి 3 ( Chandramukhi 3 ) కూడా రాబోతుందా అన్న ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ చంద్రముఖి 2 సినిమా చివర్లో 3 గురించి హింట్ ఇచ్చామని తెలియజేశారు.ఇలా ఈయన చేసిన మాటలు బట్టి చూస్తే తప్పకుండా చంద్రముఖి 3 కూడా రాబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది.
మరి చంద్రముఖి3 సినిమాలో( Chandramukhi 3 ) అయినా రజినీకాంత్ నటిస్తారా అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది.ఈ సినిమాలో లారెన్స్ తో పాటు రజనీకాంత్ కూడా నటించబోతున్నారా దీనికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించడంతో రజనీకాంత్ గారికి నచ్చితే తప్పకుండా నటిస్తారు అంటూ ఈయన సమాధానం చెప్పారు.కానీ ఖచ్చితంగా నటిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఒకవేళ ఈ సినిమాలో లారెన్స్ తో పాటు రజనీకాంత్ కూడా నటిస్తే సినిమా మరో లెవల్లో ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.మరి చంద్రముఖి 3 లో లారెన్స్ తో పాటు రజనీకాంత్ భాగమవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
.