దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటున్న చంద్రబోస్..!

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంపై ఆ సాంగ్ లిరిక్స్ అందించిన చంద్రబోస్ బావోద్వేగానికి లోనయ్యారు.నాటు నాటు సాంగ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలుసుకున్న చంద్రబోస్ ఒక స్పెషల్ వీడియో మెసేజ్ అందించారు.

 Chandrabose Response Natu Natu Song Got Golden Globe Award , Golden Globe Award,-TeluguStop.com

ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను.నాటు నాటు పాట విశ్వ వేదికపై విజయం సాధించినందుకు రైటర్ గా చాలా గర్వంగా ఉందని అన్నారు చంద్రబోస్.

తన 28 ఏళ్ల సినీ ప్రస్థానంలొ 850 సినిమాలు 3600 పైగా పాటలు రాశాను.ప్రతి పాటకు మదనమే.

ప్రతీ పాటకు జ్వలనమే, ప్రతీ పాటకు తపస్సు చేశాను.

ఇక అన్నిసార్లు తపస్సు చేస్తే ఒక్కసారైనా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు కదా నాటు నాటు పాటకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

వరాన్ని అందించాడు.ఈ అవకాశ్మ్ అందించిన కీరవాణికి, డ్యాన్స్ మాస్టర్ ప్రేం రక్షిత్ కు, అద్భుతంగా డాన్స్ చేసిన ఎన్.

టి.ఆర్, చరణ్ కు ఈ పాట పాడిన కాలభైరవ కు నా ధన్యవాదాలు అంటూ చెప్పారు చంద్రబోస్. ఈ పాటకు అవార్డ్ అందుకున్న కీరవాణి ఈ పాటలో భాగమైన ప్రతి ఒక్కరి గురించి చెబుతూ ఇది అందరికి చెందుతుందని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube