తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల ఏడవ తారీకు పోలవరం పర్యటించడానికి రెడీ అయ్యారు.ఈ విషయాన్ని పోలవరం, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు తెలియజేశారు.
శనివారం జంగారెడ్డిగూడెంలో నాగేశ్వరరావు పర్యటించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.ఆగస్టు 7వ తారీకు పార్టీ అధినాయకుడు చంద్రబాబు పోలవరం పర్యటనకు రాబోతున్నట్లు స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత మేర జరిగిందన్న దానిపై పరిశీలన చేయనున్నట్లు స్పష్టం చేశారు.ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులు అన్ని రివర్స్ టెండర్రింగ్ చేసి పనులు జరగకుండా అడ్డుకున్నారని విమర్శల వర్షం కురిపించారు.
ఇదిలా ఉంటే “ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి” అంటూ చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ఆగస్టు 4వ తారీఖు శుక్రవారం పుంగనూరు వెళుతుండగా… ఒక్కసారిగా పరిస్థితి రణరంగంగా మారటం.ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఇప్పటికే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఈ క్రమంలో ఆగస్టు 7వ తారీకు సోమవారం చంద్రబాబు పోలవరం పర్యటనకు సిద్ధం కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.