తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( N Chandrababu Naidu ) ఈనెల 5వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.అకాల వర్షాలు కారణంగా.
నష్టపోయిన పంటలను పరిశీలించడానికి రెడీ అయ్యారు.ఈ క్రమంలో రామచంద్రాపురం, కడియం మండలాల్లోని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవికాలంలో అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాలు కారణంగా పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.
అకాల వర్షాలతో సాధారణ ప్రజలతోపాటు రైతులు.తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వర్షాల కారణంగా పలు పంటలు కూడా నష్టపోవడం జరిగింది.

దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈనెల 5వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో పాడైపోయిన పంటలను పరిశీలించి… నష్టపోయిన రైతులను పరామర్శించడానికి రెడీ అయ్యారు.రైతులను ప్రభుత్వం( Farmers ) ఆదుకునే దిశగా చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చే రీతిలో ఈ పర్యటన చేపడుతున్నట్లు టీడీపీ పార్టీ నేతలు తెలియజేస్తూ ఉన్నారు.అకాల వర్షాల కారణంగా చాలామంది రైతులు నష్టపోవడంతో.
వారందరిని ప్రభుత్వమే ఆదుకోవాలని టీడీపీ( TDP ) డిమాండ్ చేస్తూ ఉంది.దాదాపు వారం రోజులకు పైగానే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి.
ఈ వర్షాలకు పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది.దీంతో ప్రభుత్వ అధికారులు కూడా.
ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.మరోపక్క అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టే రీతిలో ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.







