టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు 73 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్ ను వెన్నుపోడిచి పార్టీని లాక్కుని మోసం చేశారని తెలిపారు.
చేసిన పాపానికే ఇప్పుడు చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి కారుమూరి అన్నారు.చంద్రబాబు పాలన అంతా స్కాంలేనన్నారు.
దుర్మార్గాలు, కుంభకోణాల వలనే చంద్రబాబు జైలుకు వెళ్లారని చెప్పారు.అనంతరం దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.
గతంలో లోకేశ్ అవినీతిపరుడన్న పవన్ ఇవాళ వారికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.గతంలో చేసిన అవినీతి, స్కాంల కారణంగానే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిపారు.
ప్రజలకు వాస్తవాలు తెలుసన్న మంత్రి కారుమూరి ప్రతీ విషయాన్ని వాళ్లు గమనిస్తున్నారని వెల్లడించారు.







