రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.తాను జైలులో లేనన్న ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నానని తెలిపారు.
ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసతీయతను చేరిపేయలేరని తెలిపారు.ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందని చెప్పారు.తాను త్వరలోనే బయటకు వస్తానన్న చంద్రబాబు ప్రజలు, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని వెల్లడించారు.ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలను తనను దూరం చేశామనుకుంటున్నారు.కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోట కనిపిస్తూనే ఉంటానని చెప్పారు.
ప్రజలే తన కుటుంబమని, జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజా జీవితం తన కళ్ల ముందు కదలాడుతోందని తెలిపారు.కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని ఆరోపించారు.